కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన గిరీష్ కుమార్ కు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఎన్నికల సమయంలో అమిలినేని సురేంద్ర బాబుని కలిసి సమస్య విన్నవించారు. తప్పకుండ సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు మాట ప్రకారం గురువారం ప్రజావేదిక వద్ద గిరీష్ కుటుంబ సభ్యులకు రూ. 3లక్షలు ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆర్థిక సహాయం చేశారు. బాధితుడు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.