ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ర్టాభివృద్ధికి సహకరించాలని కోరారు. గురువారం కేంద్రమంత్రులు అమిత్‌షా, ఫియూష్గోయల్, శివరాజ్‌సింగ్ చౌహాన్, 14వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ గోనగర్యాలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ రా ష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర విభజన హామీల సమస్యలు పరిష్కరించాలని, అధిక నిధులు కేటాయించాలని, రాష్ర్టానికి జాతీయ రహదారులు, ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, అనంతపురం నుంచి అమరావతి, హైదరాబాదు నుంచి అమరావతి వరకు రోడ్లు పూర్తి చేయా లని కేంద్ర మంత్రి నితిన్ గట్కరినీ కోరారు. కార్యక్రమంలో రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ తదితరులు ఉన్నారు.