నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పిలుపులో భాగంగా మండలంలో విద్యా సంస్థల బంద్ గురువారం విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వ హించారు. మండల నాయకుడు ఎం.సిద్ధూ మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వ హణపై సమగ్ర విచారణ జరపాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ యూజీ పరీక్షలను సక్రమంగా నిర్వహిం చకపోవడం వలన లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ ఫలితాలు విచిత్రంగా ఉన్నాయని తక్షణమే నీట్ పరీక్షను రద్దుచేసి మరలా నిర్వహించాలని విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పి.మహేష్, కె.సాయి తదితరులు పాల్గొన్నారు.