విద్యార్థి సంఘాల పిలుపు మేరకు గురువారం మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలను బంద్ ప్రశాంతంగా జరిగిం ది. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాధ వ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలోని విద్యాసంస్థల వద్దకు వెళ్లి తరగతుల్లోని విద్యార్థులను బయటకు పంపివేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకులో భాగమైన ఎనటీఏ సంస్థను రద్దు చేయాలన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్, నెట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాగా పట్టణంలో తిరుగుతున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు వినయ్, కమలాకర్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విష్ణు, ఉదయ్ పాల్గొన్నారు.