గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ధ్యేయమని కడప జిల్లా, కురబలకోట డీపీవో ధనలక్ష్మి పేర్కొన్నారు. గురువారం మండలంలోని అంగళ్ళులో పీఎం నరేంద్రమోడీ దేశ వ్యాప్తంగా 500మండలాల్లో చేపట్టిన ఆస్పిరేషన బ్లాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మన రాష్ట్రంలో 7జిల్లాలలో 15మండలాలను ఎంపిక చేయగా మన జిల్లాలో 3మండలాలను ఎంపిక చేశారన్నారు. ప్రధానం గా సుపరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయడంతో పాటుగా ప్రభు త్వ సేవలను మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్ళి అందించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 40అంశాలను ఎం పిక చేసి 6అంశాలను సెప్టెంబరు ఆఖరులోగా వందశాతం పూర్తి చేయా లన్నారు. కాగా గర్బవతుల నిర్ధారణ నమోదు, పోషణ సరఫరా, 30 సంవత్పరాలు పైబడిన వారికి అధిక రక్తపోటు, మధుమేహం నిర్ధారణ పరీక్షలు, వ్యవసాయభూమి నాణ్యత పరీక్షలు, స్వయం సహాయక సం ఘాలను పునరుద్ధరించడం చేపట్టి ప్రగతిని సాధించాలన్నారు. అనం తరం ప్రతిజ చేశారు. ఆ తర్వాత జడ్పీహైస్కూల్ నుంచి అంగళ్ళు మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేట్టారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు సురేంద్రయాదవ్, టీడీపీ ఉపాధ్యక్షుడు సూరి, సర్పంచ పోరెడ్డి విశ్వనా థరెడ్డి, ఎంఈవో ఽధ్వారకనాథ్, వైద్యాధికారి శ్రీధర్, ఈఈలు హేమకు మార్, మదనమోహనరెడ్డి, ఈవోపీ ఆర్‌డి అబ్దుల్ సుకుర్, వ్యవసాయా ధికారి రాధ, పంచాయతీ కార్యద ర్శులు శేషగిరి పాల్గొన్నారు.