రాష్ట్రంలో పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో 2024-25 సంవత్సరానికిగాను ఇన్‌టేక్ అడ్మిషన్లకు అనుమతులు ఇస్తూ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గురువారం ఉత్తర్వులు వెలువరించింది. ఇందులో చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని మూడు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల్లో 1,080 ఇన్‌టేక్ అడ్మిషన్లకు, 21 ప్రైవేట్ కళాశాలల్లో 18,900 ఇన్‌టేక్ అడ్మిషన్లకు, మొత్తంగా 24 కళాశాలల్లో 19,980 ఇన్‌టేక్ అడ్మిషన్లకు అనుమతులు ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే తిరుపతి జిల్లా పుత్తూరు ఇప్పతంగలి గ్రామం ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో 360 ఇన్‌టేక్ అడ్మిషన్లకు ఏఐసీటీఈ అనుమతులు ఇచ్చింది.