హనుమాన్‌జంక్షన్ , పెరికీడు వద్ద ఏలూరు కాలువ సమీపంలో ఒక వృద్ధుడు బుధవారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందాడు. ‘‘ఎస్ఎన్ పాలేనికి చెందిన వజ్రపు సింహాచలం(65) కొన్నేళ్లుగా రైస్ మిల్లులో పనిచేస్తూ ఒంటరిగా జీవిస్తున్నాడు. వ్యక్తిగత కార ణాల వల్ల పురుగుల మందు తాగి అత్యహత్య చేసుకున్నాడు. మృతదేహం పక్కనే పురుగుమందుల డబ్బా ఉంది. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నాం.’’ అని హనుమాన్‌జంక్షన్ ఏఎస్సై సుబ్బా రావు తెలిపారు.