ప్రజల గుండెల్లో వంగవీటి మోహన రంగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, 1988లో రంగా మరణించినా నేటికీ ప్రజలు ఆయనను స్మరించుకోవడమే అందుకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీఎం రంగా విగ్రహాన్ని ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి గురువారం ఆయన ఆవిష్కరించారు. కంకిపాడు బైపాస్‌పై రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా గ్రామస్థులు కొరుతున్నా రని, వారి కోరిక నేటికి నెరవేరిందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. పార్టీలకతీతంగా పెద్ద సంఖ్యలో రంగా అభిమానులు పాల్గొన్నారు.