అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం గంగవరం ప్రాథమిక పాఠశాలను విలీనం నుండి శాశ్వతంగా మినహాయించాలని ఏపీ ఎస్ ఈ ఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన విలీనం అయిన గంగవరం పాఠశాలను సందర్శించి విద్యార్థులు, తల్లి తండ్రులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో విలీనం చేసినప్పటి నుంచి 50 మంది విద్యార్థులు పాఠశాలకు రావడం లేదని అన్నారు.