ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భారత పార్లమెంటు ద్వారా తొలిసారిగా అందిన గౌరవ వేతనాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును శుక్రవారం ఉదయం ఎంపీ కలిశెట్టి కలిసి, ఆయన తొలి గౌరవ వేతనాన్ని రూ. 1. 57 లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. దీంతో ఎంపీ కలిశెట్టిని చంద్రబాబు అభినందించారు.