ఆముదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామానికి వెళ్లే ప్రధానరహదారి గుంతల మయంగా మారిందని పలువురు వాహనదారుల శుక్రవారం తెలిపారు. కల్వర్టులు కూడా ప్రమాదకరంగా మారాయని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోఅని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తక్షణమేరహదారికి మరమ్మత్తులుచసేందుకు సంబంధిత అధికారులు చొరవచూపాలని కోరారు. అలాగేరహదారులు పూర్తిగా గోతులమయంగా మారడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు