శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి. ఆర్ రాధిక అదేశాల మేరకు శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో నిర్వహించిన పోలీస్ పరేడ్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు (అడ్మిన్) ఎస్పీ జి. ప్రేమ్ కాజల్ పరిశీలించారు. పోలీసు శాఖలో సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యమని అన్నారు. శారీరక, మానసిక దృఢత్వం ఉన్నప్పుడే ఉత్సాహంగా ప్రజలకు సేవలు అందించగలమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరేడే నిరహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.