మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రుతుక్రమ సెలవులు మంజూరు చేయడం వల్ల మహిళలు ఉద్యోగావకాశాలు కోల్పోయే అవకాశం ఉందని అభిప్రాయపడింది. వారి శ్రామిక శక్తి కూడా తగ్గిపోతుందని పేర్కొంది. ఈ మేరకు రుతుక్రమ సెలవుల కోసం దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం కొట్టివేసింది. ఈ సమస్యపై పాలసీని రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలని కేంద్రానికి సూచించింది.