దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని రైతుసంక్షేమం కోసం 2019వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్ జగన్ మోహన్ రెడ్డివినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైతు పక్షపాతి అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి గుర్తింపుగా రైతు దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల పాటు ఏపీలో రైతు దినోత్సవాన్ని వైయస్ఆర్ జయంతి సందర్భంగా నిర్వహించారు. ఇవాళ మహానేత వైయస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకొని వైయస్ఆర్ జిల్లాలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ శ్రేణులు రైతు దినోత్సవాన్ని నిర్వహించి, వైయస్ఆర్ వ్యవసాయ రంగానికి చేసిన మేలులను గుర్తు చేసుకుంటున్నారు. రైతు దినోత్సవం సందర్భంగా కడప ఎయిర్ పోర్ట్ లో వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వైయస్ఆర్సీపీ రైతు విభాగం నాయకులు, రైతులు, పార్టీ నాయకులు నాగలి బహుకరించారు.