చంద్రబాబు.. రేవంత్‌రెడ్డితో ఏం చర్చించారో రాష్ట ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. కూటమిలో ఉన్న మూడు పార్టీలు సమాధానం చెప్పాలి. వెంకటేశ్వరస్వామి ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరింది నిజామా కాదా?. ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు రూపంలో ఏపీకి పాపం తగిలింది. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణం. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చారు. ఏపీకి చెందిన ఆస్తులు వదిలేసి ఎందుకు పారిపోయి వచ్చారు.’’ అంటూ కాకాణి నిలదీశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ ఆరంభ శూరత్వాలే. ఆయన అనుకూలం మీడియా ఆహా.. ఓహో అనడం తప్ప సాధించిన ఫలితాలు లేవు. తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశంపై ఎంతో హైప్ క్రియేట్ చేశారు. ఈ భేటీలో ఏ అంశాలపై స్పందించారో.. వేటికి పరిష్కారం లభించిందనే విషయాన్ని వెల్లడించలేదు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కోసం ఒక ఆర్కిటెక్ మాదిరిగా చంద్రబాబును రేవంత్‌రెడ్డి పిలిచినట్టుంది’’ అంటూ కాకాణి ఎద్దేవా చేశారు.