ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ పి. నైనవరం, నున్న నుంచి వేళంకిణికి 70 మంది గ్రామస్తులు పయనమయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే వేళంకిణికి వస్తావని మొక్కుకున్నామని నైనవరం గ్రామస్తులు తెలిపారు. తమ కోరిక నెరవేరిందని, టీడీపీ నాయకుడు దేవేంద్ర ఆధ్వర్యంలో 70 మంది నైనవరం గ్రామస్తులు వేళంకిణికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా దేవేంద్ర మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని వేళంకిణి మాతకు మొక్కుకున్నామని, అలాగే యార్లగడ్డ వెంకట్రావు భారీ మెజారిటీతో విజయం సాధించాలని గ్రామస్తులు ముక్కురని చెప్పారు. తమ కోరిక నెరవేరిన క్రమంలో గ్రామస్తులు అందరం కలిసి ముందు కాశీ వెళ్ళామని, ఇప్పుడు 70 మందితో కలిసి వేళంకిణికి బయలుదేరి వెళుతున్నామని దేవేంద్ర తెలిపారు.