రాయచోటి పట్టణంలోని నాజ్ హాల్ సమీపంలో అబ్దుల్ రహీం (22) అనే యువకుడు ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. గున్నిగుంట్ల రోడ్డు సమీపంలోని గుర్రాలకుంట లో మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి తీసుకెళ్లారు. అయితే, తన కుమారుడిని ఎవరో హత్య చేశారని అబ్దుల్ రహీం తండ్రి అర్బన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. రోజూ మద్యం తాగి వేధిస్తున్నాడన్న కారణంతో కుటుంబ సభ్యులే గొంతుకోసి హత్య చేసి ఉంటారని మృతుడి తండ్రితో పాటు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ భక్తవత్సలం తెలిపారు.