రాజమహేంద్రవరం కాషాయరంగు పులుముకుంది. ఎటు చూసినా బీజేపీ ఫ్లెక్సీలతో నిండిపోయింది.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నేపథ్యంలో సోమవారం సందడి నెలకొంది.రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ విస్తృతస్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం తొలిసారిగా ఇక్కడ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఊహించని విధంగా బీజేపీ ఫలితాలు సాధించి ంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు. ముగ్గురు ఎంపీలు గెలిచిన సంగతి తెలిసిందే.దాంతో పాటు తమ కూటమి ప్రధాన భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం 134 సీట్లు , మరో భాగస్వామ్య పార్టీ జనసేన 21 స్థానా లు సాధించాయి. దీంతో అప్పటి అధికార వైసీపీని మట్టి కరిపించి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసిన జోష్ పార్టీలో కనిపిస్తోంది.అంతే కాదు కేంద్రంలో కూడా మోదీ మూడోసారి ప్రధాని కావడం కూడా ఈ పార్టీకి మరింత ఉత్సాహాన్ని కల్పిస్తోంది. ఇదిలా ఉండగా తొలిసారి బీజేపీ విస్త్రత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంజీ రాలో జరగనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేం ద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన సోమవా రం ఉదయం సుమారు 10 గంటలకు సమావేశం జరగనుంది. గత ఐదేళ్లలో రాష్ట్రం విచ్ఛిన్నమైంది. అప్పులపా లైంది. అభివృద్ధి లేదు. అరాచకం తాండవమాడింది. రాష్ట్ర విభజన అంశాలు అనేకం సాధించుకోవాల్సి ఉంది. పోలవ రం ప్రాజెక్టును కుదేలు చేసింది.రాజధాని అమరావతి నిర్మాణాన్ని అర్ధంతరంగా ఆపేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ రాష్ట్రం అభివృద్ధి కోసం ఇక్కడ ఏ ఏ అంశాలపై చర్చించనున్నదనేది ఆస క్తిగా మారింది. వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది. పలు సందర్భాల్లో పురందేశ్వరి కూడా ఇదే చెప్పారు. దీనిపై తీవ్ర చర్చ జరగనుంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతిపై ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో బీజేపీ బలపడే విధంగా కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.గతంలో ఎన్నడూ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు లేరు.ఈసారి ఎమ్మెల్యేలతో పాటు ఎం పీలు ముగ్గురు గెలిచారు.క్రమంగా స్థానిక ఎన్నికలు వస్తాయి. నామినేటెడ్ పదవులు ఉంటాయి. పార్టీ ఎదు గు దల, గుర్తింపుపై చర్చించడంతో పాటు గతం కంటే ఆంధ్ర లో పార్టీ మెరుగుపడేందుకు కొన్ని తీర్మానాలు చేసే అవకా శం ఉంది. ఏపీ అభివృద్ధే ప్రధాన అజెండాగా ఉంటుందని చెబుతున్నారు.సమావేశానికి కేంద్రమంత్రులు కె.మురుగన్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యు లతో పాటు అసెంబ్లీ కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు హాజరవుతారు. మొత్తం 2,250 మందికి ఆహ్వానం పంపా రు.ఇప్పటికే చాలా మంది నేతలు రాజమహేంద్రవరం చేరు కున్నారు.జిల్లాలోని నేతలు పలు బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాట్లపై పురందేశ్వరి చర్చిం చారు.నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు.అతిథులకు రూ మ్‌లు ఏర్పాటు ,సిటీ డెకరే షన్,స్టేజ్ ఏర్పాటు, ఎయిర్‌పోర్ట్ వద్ద రైల్వే, బస్టాండ్ల వద్ద ప్రముఖులకు స్వాగతం పల కడానికి పలు కమిటీలు వేశారు.