రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం అనపర్తిలో పర్యటించనున్నారు. ఉదయం 7.40నిమిషాలకు మదురపూడి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి అనపర్తి మండలం రామ వరంలోని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసానికి చేరుకుం టారు. అక్కడ బ్రేక్ పాస్ట్ అనంతరం 9గంటలకు అనపర్తిలోని ఏరియా ఆసుపత్రి అపగ్రేడ్ అయిన సందర్భంగా నూతనంగా నిర్మించనున్న అదన పు భవన నిర్మాణాలకు మంత్రి భూమిపూజ నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి 9.50 నిమిషాలకు బయలుదేరి 10.30కు రాజమహేంద్ర వరం చేరుకుని స్థానికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలలో సాయంత్రం 6గంటల వరకు పాల్గొని రాత్రి 9 గంటలకు విజయవాడ చేరుకుంటారు. మంత్రి పర్యటన సందర్భంగా అనపర్తి ఏరియా ఆసుపత్రిలో నిర్వహించే భూమిపూజ కార్యక్రమ ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎన్డీయే నాయకులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తాడి రామగుర్రెడ్డితో మాట్లాడుతూ ఆసుపత్రికి అవసరమైన మౌలిక సదు పాయాలను గుర్తించి మంత్రికి వినతిపత్రం అందించాలని సూచించారు. అదేవిధంగా నూతన భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఎన్డీయే కూ టమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిగా జరుగుతున్న ప్రభు త్వ కార్యక్రమమని మంత్రి పాల్గొనే ఈ కార్యక్రమానికి అనపర్తి నియో జకవర్గంలోని ఎన్టీయే కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్య కర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎన్డీయే నాయకులు తమలంపూడి సుధాకరరెడ్డి, కొవ్వూరి శ్రీనివాస రెడ్డి, చౌదరి, మామిడిశెట్టి శ్రీను, గొలుగూరి భాస్కరరెడ్డి, వోగిరెడ్డి రాధ పాల్గొన్నారు.