బొబ్బిలి మండలంలోని కారాడ గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. బాధితురాలు, పోలీసులకథనం మేరకు.. బాడంగి మండ లంలోని ఆనవరం గ్రామానికి చెందిన పార్వతీ కారాడ గ్రామంలో వారాలపండుగ కోసం వచ్చిందిన బంఽధువుల ఇంట్లో భోజనం చేసి తిరిగి తమ స్వగ్రామానికి కాలిన డకన బయలుదేరింది. కారాడ గ్రామ శివారులో పార్వతీ మెడలో మూడుతులాల బంగారం గొలుసు, అరతులం పుస్తెలతాడును గుర్తుతెలియని దుండగులు తెంపుకొని పోయారు. దీంతోపార్వతీ గాయపడడంతో స్థానికులు గుర్తించి బొబ్బిలి ప్రభుత్వాసు పత్రికితరలించారు. సమాచారం తెలియగానే సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. కాగా ఏమి జరిగిందోతెలియదని, ఒంటిపైగాయాలు, రక్తం కనిపించిందని, మెడలో మూడు న్నర తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదని ఆమె చెబుతోంది. చెవికి ఉన్న దుద్దుల్లో ఒకటి కింద పడిపోయిఉంది. ముఖంపై కొట్టిన గాయాలు కనిపిస్తున్నాయి. వెనుక నుంచి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆమె మెడలో నుంచి గొలుసు, పుస్తెల తాడును దొంగిలించినట్లు అనుమానిస్తున్నారు. ఈఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్నా మని సీఐ నాగేశ్వరరావు తెలిపారు. పార్వతీకి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు.