కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని రాజమహేంద్రవరంరూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఆదివారం కడియం విజయ థియేటర్ వద్ద రూ.2లక్షల మండల నిధులతో కల్వర్టు వైండింగ్, బుర్రిలంకలో రూ.40లక్షలు (మండల నిధులు రూ.20 లక్షలు, పంచాయతీ నిధులు రూ.20లక్షలు)తో నిర్మించే సీసీరోడ్డు కమ్ డ్రైను, రూ.34లక్షలు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించే కడియపులంక జాతీయ రహదారి సమీపంలో ఆంజనేయస్వామి ఆలయం సమీపం నుంచి రోడ్డు నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలోని కడియం మండలంలో ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా తాగునీరు, రోడ్లు, డ్రైన్లు వంటి అభివ ృద్ధి పనులకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలిపారు. జలమిషన్ ద్వారా ప్రతీఇంటికి సురక్షిత మంచినీరు అందించే యోచనలో ఉన్నామని అందుకోసం ప్రణాళికలు చేస్తున్నామన్నారు. రహదారులు మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా సర్వే చేయించి పార్టీలకు అతీతంగా ఆక్రమణలు తొలగించి రోడ్లు విస్తరణ చేయించే చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మోసిగంటి సత్యవతి, వెలుగుబంటి ప్రసాద్, పాటంశెట్టి రాంజీ, పంతం గణపతి, అన్నందేవుల చంటి, వెలుగుబంటి నాని, చెల్లుబోయిన శ్రీనువాసరావు, గట్టి నర్సయ్య, ముద్రగడ జమీ, వరగోగుల వెంకటేశ్వరరావు, గట్టి సుబ్బారావు, నాగిరెడ్డి రామకృష్ణ, ఆదిమూలం సాయిబాబా, గుర్రపు సత్యనారాయణ, పితాని శివరామకృష్ణ, గోరు నాగేశ్వరరావు, షేక్ సిద్దయ్య, మండల జేఈ త్రిమూర్తులు పాల్గొన్నారు.