ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో సోమవారం కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాస్పిటల్లో కందుల నారాయణరెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కందులకు మంత్రి సూచించారు.