ప్రకాశం జిల్లా మార్కాపురంలో గుంటూరు జిల్లా రేపల్లె నుంచి వచ్చిన ఓ వ్యక్తి హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నానని నమ్మించి పలువురు వద్ద సుమారు 30 లక్షల రూపాయలు వసూలు చేసిన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంతకు వైద్యశాల నిర్మాణం చేపట్టకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారికి అనుమానం వచ్చి నిలదీయడంతో చల్లగా జారుకున్నాడు. దీంతో బాధితులు రెండు రోజుల క్రితం పట్టణ పోలీస్ స్టేషన్లో మౌఖికంగా ఫిర్యాదు చేశారు.