వాడరేవు- పిడుగురాళ్ల హైవేపై ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రహదారి విస్తరణలో భాగంగా బీటీ రోడ్డు వెంట ఉన్న ఏళ్లనాటి చెట్లను గుత్తేదారు కూలీలతో తొలగిస్తున్నారు. దీంతో పర్చూరు - కారంచేడు మధ్య కొన్ని భారీ వృక్షాలు మంగళవారం రోడ్డుపై ఆడ్డంగా పడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు ముందుకు, వెనక్కి కదిలే వీల్లేకపోవడంతో చోదకులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa