అన్నమయ్య జిల్లా కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయితీ నారాయణరాజు పోడు గ్రామంలో అర్హులైన పేదలకు భూములు పంపిణీ చేయాలని సిపిఐ నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు. రాజశేఖర్, మొగల్ వినయ్, శివ ఆధ్వర్యంలో రాజంపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశా రు. 1/4 సర్వే నెంబర్లు 250 ఎకరాలకు పైగా బంజరు భూములు ఉన్నాయి అవి వెంటనే ప్రభుత్వం పేదలకు ఇవ్వా లని కోరారు.