పులివెందుల పార్నపల్లెరోడ్డులో ఉన్న వైఎస్ఆర్ మీట్ మార్కెట్లో ఉన్న మటన్, చేపలు స్టాళ్ల కార్యాలయ బహిరంగ వేలం ఈనెల 24న వేస్తున్నట్లు మంగళవారం కమిషనర్ రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 24న బహిరంగ వేలానికి పిలిచామని, ఎవరూ రాకపోవడంతో వాయిదా వేశామన్నారు. వేలానికి వచ్చేవారు ఈనెల 24న ఉదయం 10 గంటల లోపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.