ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన చర్చల వివరాలను బహిర్గతం చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సీఎంల భేటీ అంత రహస్యమెందుకని ప్రశ్నించారు. 7 మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్న ప్రతిపాదనతో పాటు, తిరుమల ఆదాయంలో, పోర్టుల్లో, కృష్ణా జలాల్లో వాటా కావాలంటూ… తెలంగాణ ప్రభుత్వం అడిగిందని మీడియాలో వార్తలు వస్తే వాటిపై చంద్రబాబు స్పందించకపోవడం పై అందరికీ అనుమానాలు కలుగుతున్నాయన్నారు. చంద్రబాబు మరోసారి ఏపీకి తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారని అంబటి ధ్వజమెత్తారు.