దేశం నుంచి నల్లధనాన్ని ఏరివేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వం 2016లో రూ. 500, 1000 నోట్లను ఉపసంహరించుకుంది. దాంతో ఏర్పడ్డ కరెన్సీ కొరతను తీర్చడానికి రూ.2000 నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత వాటినీ కూడా రద్దు చేసింది. కాగా.. నోట్ల రద్దు గురించి తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు (మంగళవారం) ఎస్‌ఎల్‌బీసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కొందరు గత ఐదేళ్లలో కొట్టేసిన సొమ్ముతో వ్యవస్థను కొనుగోలు చేయాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. వీరి అవినీతిని అరికట్టాలంటే రూ.500, రూ.200 నోట్లు రద్దు చేసి డిజిటల్ కరెన్సీ తీసుకురావాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.