కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘వైఎస్ఆర్ 75వ జయంతి’ కార్యక్రమంలో ఏపీ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2009 నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన వైఎస్ షర్మిల తండ్రి లాగే 2029 లో సీఎంగా అవుతారని వ్యాఖ్యానంచారు. 2029లో దేశంలో రాహుల్ గాంధీ ప్రధానిగా, రాష్ట్రంలో షర్మిల సీఎంగా పని చేస్తారని జోస్యం చెప్పారు. తండ్రి ఆశయాలను మోసే వాళ్లనే వారసులుగా గుర్తించాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేదే వైయస్ ఆలోచన అని రేవంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు, వైయస్ ఆశయాలను సాధించేలా సహకరించాలంటూ ఏపీ కాంగ్రెస్ శ్రేణులను ఆయన కోరారు. ‘‘ వైయస్ పేరు మీద వ్యాపారం చేసే వాళ్లు వారసులా.. ప్రజలారా ఆలోచన చేయండి. వైయస్ ఆశయ సాధన కోసమే షర్మిల నేడు బాధ్యత తీసుకున్నారు. గాంధీ కుటుంబం ఇచ్చే ఆదేశాలు పాటించేవాడిగా, తెలంగాణా సీఎంగా చెబుతున్నాను. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, కార్యకర్తం కోసం మేమంతా అండగా ఉంటాం. మేమంతా మీకు ఉంటామనే భరోసా ఇచ్చేందుకే మా మంత్రి వర్గం మొత్తం ఇక్కడకు వచ్చా’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.