ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించి సాగు చేపట్టే విధంగా ప్రోత్సహించాలని తంబళ్లపల్లె ఎంపీడీవో క్రిష్ణమూర్తి ఉపాధి సిబ్బందికి సూచించారు. మంగళవారం ఏపీవో అంజినప్పతో కలసి స్థానిక వెలుగు కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ..ఉపాధిలో పండ్లతో టలు, పూలతోటల సాగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదేవిధం గా పాడిరైతులు పశుగ్రాసం పెంచుకోవడం, పొలం గట్లపై మొక్కల పెం పకం చేపట్టవచ్చన్నారు. ఏపీవో మాట్లాడుతూ..ఉపాధిలో పండ్లతోటలు చేపట్టే రైతులకు మూడు సంవత్సరాలకు తోట సంరక్షణకు మామిడి తోటకు ఎకరాకు 70 మొక్కలకు రూ.99,911లు, కొబ్బరిచెట్లు ఎకరాకు 65 మొక్కలకు రూ.88,300లు, అల్లనేరేడుకు ఎకరాకు 40 మొక్కలకు రూ.61 వేలు ఇస్తారన్నారు. రైతులకు పండ్లతోటలు, పూలతోటల పైన అవగాహ న కల్పించి సాగు చేపట్టేవిధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఉపాధి ఇంజనీర్ రామన్న ఎంటీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.