కొండాపురం మండల పరిధిలోని పొట్టిపాడు గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురి జూదరులను మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై యోగేంద్ర తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తమ సిబ్బందితో జూద స్థావరాలపై దాడులు చేశామన్నారు. ఈ ఘటనలో ఏడుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 23, 910 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa