చిట్వేలు మండలం నక్కల పల్లి గ్రామంలో బుధవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు విగ్రహ స్థాపనకు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి బార్య వరలక్ష్మి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నందమూరి తారకరామారావు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావించానని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa