కొత్తవలస పోలీస్ స్టేషన్ దిశ వాహనంలో పనిచేస్తున్న హోంగార్డు గిడుతూరి వెంకట సత్యం (48) వేపాడ మండలం బొద్దాంలోని ఆయన నివాసంలో కరెంట్ షాక్ తో బుధవారం మృతి చెందినట్లు వేపాడ ఎస్సై కే రాజేష్ తెలిపారు. మృతుడు భార్య పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా వెంకట సత్యం మృతదేహాన్ని ఎస్ కోట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.