సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేత పత్రం ఆత్మస్తుతి - పరనిందలతో కూడి ఉందని ఏపీ సీసీ మీడియా చైర్మెన్ తులసిరెడ్డి విమర్శించారు. బుధవారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ. జగన్ అధికారంలోకి వచ్చాక 8సార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ. 32, 166 కోట్ల భారాన్ని వినియోగదారులపై మోపారన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచం, వ్యవసాయ మోటర్లకు మీటర్లు తొలగిస్తామన్నారన్నారు.