అవనిగడ్డ నియోజకవర్గంలో ఇకపై చట్టబద్ధమైన పాలన జరగాల్సిందే నని, రూల్ ఆఫ్ లా అమలు కావాలని అధికారులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. చల్లపల్లి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కోట విజయరాధిక అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండలి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలోలాగా తన హయాంలో తప్పులు జరిగితే ఊరుకు నేది లేదని ఆయన హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో మండలంలో ఎన్నో తప్పులు జరిగాయన్నారు. ఇళ్లపట్టాల కేటాయింపులు, గృహనిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. గ్రామాల్లో రాజకీ యాలతో సంబంధం లేకుండా అభివృద్ధే ప్రధానంగా అందరూ కలిసి పనిచే యాలని కోరారు. ప్రతి శాఖ పనితీరు సమీక్షించేందుకు ఆకస్మిక పర్యటనలు చేస్తానన్నారు. గ్రామాల్లో రోడ్లు వేయించే బాధ్యత తీసుకుంటాననీ, తాగునీటి సమస్య నియోజకవర్గంలో ఉండకూడదని అన్నారు. డ్రెయినేజీల్లో గుర్రపుడెక్క, తూటుకాడ తొలగింపు పనులు పర్యవేక్షించాలన్నారు. ఎమ్మెల్యేను మండల పరిషత్ పాలకవర్గం, సర్పం చ్‌లు, అధికారులు సన్మానించారు. వైస్ ఎంపీపీలు మోర్ల రాంబాబు, పిట్టు వెం కటేశ్వరమ్మ, ఎంపీడీవో ఎన్.నాగలక్ష్మి, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి అధికా రులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.