ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉచిత ఇసుక విధానం గందరగోళంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆధార్‌కార్డు ఉంటే రోజుకో లారీ ఇసుక ఇస్తుండగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇంటి ప్లాన్ ఉంటేనే ఇసుక ఇవ్వాలని నిబంధన విధించడంతో ఒక వైపు వినియోగదారులు, మరో వైపు టిప్పర్ లారీల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి రెండు జిల్లాల్లోనూ అన్ని ర్యాంప్‌లలో ఇసుక ఎగుమతులు నిలిచిపోయాయి. ఉన్న కొద్దిపాటి స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. స్టాక్ పాయింట్‌లలో సకాలంలో ఎగుమతులు కాక టిప్పర్ లారీల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన విధి విధానాలు రూపొందించాలంటూ లారీ అసోసియేషన్ నేటి నుంచి లారీల బంద్‌కు పిలుపునిచ్చింది.