శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెనీల యాజమాన్యం ఇంటర్వ్యూ నిర్వహించగా. నిరుద్యోగ యువత 170 మంది హాజరయ్యారు. ఇందులో 31 మందికి ఎంపిక చేసి ఉపాధి కల్పించినట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధా తెలిపారు.