ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారి ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. శుక్రవారం కోడూరు శివారు ఉల్లిపాలెం గ్రామానికి చెందిన పెద్ద సింగు రాంబాబు అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని డంపింగ్ చేస్తున్నాడని సమాచారంతో కోడూరు ఎస్సై శిరీష ఆధ్వర్యంలో ఉల్లిపాలెం బ్రిడ్జి దగ్గర మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 12 బస్తాల రేషన్ బియ్యం పరుచుకున్నారు.