సినిమా టికెట్లకు సంబంధించి నాడు గత ప్రభుత్వం జారీ చేసిన జీఓను తప్పు బట్టిన టీడీపీ నేతలు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, అదే జీఓ అమలు చేస్తున్నారని పేర్ని నాని తెలిపారు. ‘సినిమా రేట్లు పెట్టడానికి నువ్వు ఎవరు? సినిమా వాళ్లంతా మీ కాళ్ల వద్దకు రావాలా? జగన్.. అని నాడు దుయ్యబట్టారని మాజీ మంత్రి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే జీఓ ప్రకారం సినిమా టికెట్ల రేటు పెంచారని చెప్పారు. నాడు జారీ చేసిన జీఓ సరైంది కాదని భావిస్తే, దాన్ని ఎందుకు రద్దు చేయలేదని నిలదీశారు.