కళ్యాణదుర్గం పట్టణంలో రైతు బజార్ ను ఆర్డిఓ రాణి సుస్మిత శనివారం ప్రారంభించారు. నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు బజార్ ను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు కిలో కందిపప్పు రూ. 160లు, కిలో మేలురకం బియ్యం రూ. 45లకు విక్రయిస్తున్నట్లు రైతు బజార్ నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని కళ్యాణదుర్గం పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.