పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని శనివారం అచ్చవెల్లిలో డెంగీ వ్యతిరేక మాసోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా సబయూనిట్ అధికారి సిద్ధయ్య మాట్లాడుతూ దోమ పుట్టుకను నివారించాలి, దోమకాటు ద్వారా మలేరియా, డెంగీ, చికెన్ గూన్యా, ఫైలేరియా, మెదడువాపు వంటి ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందన్నారు. దోమల వ్యాప్తిని నివారిస్తే వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు.