46 ఏళ్ల తర్వాత పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. దీంతో ఆలయ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అందుకోసం పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు ఎవరినైనా కాటు వేస్తే.. సత్వర వైద్యం కోసం వైద్యుల్ని కూడా సిద్ధం చేశారు. లోపల చీకటిగా ఉంటుందని సెర్చ్లైట్లు ఏర్పాటు చేశారు.