పామాయిల్ పంట టన్నుకు రూ.17 వేలు కనీస మద్దతు ధర కల్పించడానికి కృషి చేస్తానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ అన్నారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పామాయిల్ రైతులతో సమావేశం జరిగింది. ఎంపీ మాట్లాడుతూ.. ‘పొగాకు, కొబ్బరి పంటలకు బోర్డులు ఏర్పాటు చేసినట్టుగానే పామాయిల్‌కు బోర్డు ఏర్పాటు చేస్తాం. పోలవరం, చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేస్తాం. కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ర్టాభివృద్ధికి కృషి చేస్తా ’.. అని తెలిపారు. అలాగే వరి రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాజమండ్రిలో అతిపెద్ద రైస్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నామని, ప్రతీ రోజు 3500 టన్నుల ధాన్యం అవసరమవుతుందని, ఆ ఫ్యాక్టరీకి రైస్ సరఫరా చేసే రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, తడిచిన ధాన్యాన్ని కూడా వారే కొంటారని తెలిపారు. రైతుల సమ స్యల పరిష్కారానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని, రెండే ళ్ళుగా వైసీపీ ప్రభుత్వం రైతులకు తగ్గించి ఇచ్చిన సొమ్ము ను తిరిగి ఇప్పించడానికి కృషి చేస్తానన్నారు. ఈ సమా వేశాల్లో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీరామకృష్ణ,. పామా యిల్ రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరరాఘవరావు, జాతీయ కార్యదర్శి క్రాంతికుమార్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ అధ్యక్షుడు ఉండ వల్లి వెంకట్రావు, నవ భారత్ అధ్యక్షుడు ఆచంట సూర్యనారాయణ, చింతమనేని హను మంత రావు, సాయిబాబు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, ఎం.శ్రీనివాసరావు, పాల్గొన్నారు.