పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఉపాధ్యాయులను ఆదే శించారు. శుక్రవారం కర్నూలు నగరంలోని ప్రభుత్వ టౌన్ మోడల్ హై స్కూల్‌లో కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యాబోధన, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. వంట సరుకుల నాణ్యత, కోడిగుడ్ల పరిమా ణాన్ని పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనం రుచి చూశారు. విద్యా ర్థులు ఆరుబయట భోజనం చేస్తున్న విషయాన్ని గమనించిన కలెక్టర్ వారిని కారిడార్‌లో కూర్చోబెట్టి భోజనం చేయించి ఆ తర్వాత కారిడార్‌ను శుభ్రం చేసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం తో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్ని గంటలకు భోజనం అందిస్తున్నారు.. భోజనం బాగుందా, రక్తపరీక్షలు చేస్తున్నారా.. ఐరన్, పోలిక్‌యాసిడ్ సప్లిమెంట్లు ఇస్తున్నారా.. అని ప్రశ్నించారు. అనంతరం ప్రాంగణంలో ఉన్న షెడ్స్, పరిరాలు, వాటర్ ప్లాంట్, మరుగుదొడ్లను పరిశీలించారు. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం హెచ్‌ఎం చాంబరులో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరు పట్టికను పరిశీలించి అందరూ ఉపాధ్యాయులు హాజరయ్యారా లేదా అని పరిశీలించారు. గత సంవత్సరం 46 శాతం మాత్రమే ఉత్తీర్ణత కావడం పట్ల కలెక్టర్ స్పందిస్తూ బీసీ, ఎస్సీ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు 80 శాతం పైగా ఉత్తీర్ణత సాధించారని, అలాగే ఇక్కడ కూడా ఉత్తీర్ణత శాతం తగ్గకూడదన్నారు. అనంతరం కళాశాల ల్యాబ్స్, లైబ్రరీని సందర్శించారు. అనంతరం విద్యార్థుల మధ్యాహ్న భోజనం చేసేం దుకు ఒక షెడ్డు అవసరమని, కాలేజీ ప్రిన్సిపాల్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అందుకు సంబంధించి నివేదికలు పంపించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట డీఈవో శామ్యూల్, డిప్యూటీ డీఈవో హనుమంతరావు, జూనియర్ కళశాల ప్రిన్సిపాల్ సుంకన్న, ఇన్‌చార్జి హెచ్‌ఎం ప్రసాద్ పాల్గొన్నారు.