ఇటీవల కంభంలో పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు ని ర్వహించి నిబంధనలకు విరుద్ధంగా మత్తు టాబ్లెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు మార్కాపురం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పీబీ.సంధ్య తెలిపారు. శుక్రవారం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావే శంలో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ , డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సంధ్యా సంయుక్తంగా నిర్వహిచిన మీడియా సమావేశంలో ఆమె మాటా ్లడారు. కంభంలో ఈనెల 7న మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. అ యితే మహేశ్వరి మెడికల్స్, బాలాజీ మెడికల్స్‌లో నిబంధనలు పాటించకుండా మత్తు ట్లాబెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తిచామని, వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకు ంటామని హెచ్చరించారు. డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేకుండా మందులు విక్రయించకూడదని స్పష్టం చేశారు. మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు, ఎస్‌ఈబీ సిబ్బంది పాల్గొన్నా రని ఆమె పేర్కొన్నారు.