గుంటూరు జిల్లా, రేపల్లె మండలం పెనుమూడి కృష్ణానది వద్ద కొంతమంది గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ.... పెనుమూడి వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టు సమాచారం తెలియడంతో పట్టణ సీఐ నీజర్బేగ్ ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటుచేసి 10 మందిని అరెస్టు చేశామన్నారు. ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. నిందితుల నుంచి 6.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పరస రాజ్‌కుమార్, తోట ధనుష్కుమర్, తోట అనిల్‌కుమార్ అరకు, పాడేరులో గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ విక్రయాలు జరుపుతురని పేర్కొన్నారు. కాగా.. వైసీపీ నాయకుడు ఆళ్ల రాజ్‌పాల్, బంటి పరారీలో ఉన్నారని తెలిపారు.