గన్నవరం నుంచి ముంబై వెళ్లవలసిన ఎయిర్‌ఇండియా విమానం నిలిచిపోయింది. రోజూ ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయానికి సాయంత్రం 5.40 గంటలకు వచ్చి రాత్రి 7.20 గంటలకు వెళుతుంది. ఆదివారం ముంబై నుంచి వచ్చిన విమానం తిరిగి వెళ్లే సమయంలో సాంకేతిక సమస్య వచ్చినట్టు పైలెట్ గుర్తించాడు. దీంతో విమానం రద్దుచేసినట్టు అధికారులు తెలిపారు. ముంబైకి 171 మంది ప్రయా ణికులు వెళ్లాల్సి ఉండగా వారిలో చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఉన్నారు. విమానం రద్దు కావడంపై ప్రయాణికులు ఆందోళన చేశారు. తాము ముంబై నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సి ఉందని, మా పరిస్థితి ఏంటని ఎయిర్ ఇండియా సిబ్బందిని నిలదీశారు. కొద్దిసేపు విమానా శ్రయంలో గందరగోళం నెలకొంది. కొందరు కార్లలో హైద రాబాద్ వెళ్లి అక్కడ నుంచి ప్రత్యామ్నాయ విమానంలో ముంబై వెళ్లేందుకు బయలుదేరారు. ముంబై విమానం రద్దుకావడంతో ప్రయాణికులు లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది.