మరిన్ని ఉత్పత్తులను పెంచి రాయితీలిచ్చి ఆక్వా రంగ అభివృద్ధికి కృషి చేస్తామని గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కైకలూరులో రాష్ట్ర చేపల రైతుల అసోసియేషన్ కార్యాలయాన్ని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నంబూరి వెంకట రామరాజు (తాడినాడ బాబు) ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆక్వా రంగానికి కైకలూరు ప్రసిద్ధి చెందిందని సబ్సిడీపై విద్యుత్ రాయితీలను ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తామని రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఆక్వా రైతుల సమస్యలను ఈ సంఘం ద్వారా రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సీఎం చంద్రబాబుతో చర్చించి పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ముదునూరి సీతారామరాజు, సంఘ సభ్యులు పెన్మెత్స బోసురాజు, దొప్పలపూడి రవికుమార్, గాదిరాజు వెంకట సుబ్బరాజు, జంపన రామలింగరాజు, లింగమనేని భానుప్రసాద్, చదలవాడ శేషగిరిరావు, కొండ్రెడ్డి సత్యనారాయణ, గాదిరాజు భాస్కరరాజు, పేరిచర్ల రామరాజు తదితరులు పాల్గొన్నారు.