కూనవరంలోని కమ్యూనిటీ హెల్త్ కేంద్రాన్ని మంగళవారం డిప్యూటీ డిఎం ఎండ్ హెచ్ ఓ డా పుల్లయ్య సందర్శించారు. ఈ సందర్బంగా హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులు జ్వరంతో హాస్పిటల్ కి రావడంతో వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ విద్యార్థులు అనారోగ్యంతో వస్తే మెరుగైన వైద్య సేవలు అందించాలని సూపరింటెండెంట్ డా. కె. మహేష్ బాబును ఆదేశించారు.