ప్రాణ నష్టం లేని విధంగా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని, అన్ని చోట్లా ఆటోమెటిక్ అలారం మెకానిజం ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, కంపెనీల యాజమాన్యాలను విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో మంగళవారం వివిధ విభాగాల అధికారులతో జిల్లా క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ మీటింగ్ నిర్వహించారు.